సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్చదనం పచ్చదనము కార్యక్రమాన్ని రెండవ రోజు కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కరీంనగర్ ఇంటర్మీడియట్ విద్య అధికారి (డిఐఈఓ) జగన్మోహన్ రెడ్డి హాజరై కళాశాలలో మొక్కలు నాటినా తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86వ జయంతి సందర్బంగా పూలమాలవేసి నివాళి అందించాడు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఐఈఓ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల మొక్కలు నాటడముతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.బాల్యం నుండే సేవా భావాన్ని అలవార్చుకోవాలని సూచించారు.అలాగే ఫ్రొ.కొత్తపల్లి జయశంకర్ గురించి మాట్లాడుతు తెలంగాణ సాధనలో జయశంకర్ చాలాకీలక పాత్ర అని తన తుది శ్వాస వరకు తెలంగాణ కోసము ఏన్నో పోరాటాలు చేసి తెలంగాణ రావడానికి కీలకపాత్ర పోషించారని ఉన్నారు. అనంతరం విద్యార్థులకు ఫ్రీ బుక్స్ మరియు స్టడీ మెటీరియల్ పంపిణి చేయడం జరిగింది.విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జాతీయ సేవా ప్రోగ్రాం అధికారి పి.రాజశేఖర్ అధ్యాపకులు శశిధర్ శర్మ,మహేందర్రావు,రాజు,కృష్ణప్రసాద్ రాజశేఖర్ వినయ్ లు సుజాత రాజు అధిక సంఖ్యలో ఎన్ఎస్ఎస్ వాలీంటీర్స్ అధిక పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
