- హోరాహోరీ పోరులో బుడిగె శ్రీకాంత్ ను వరించిన అధ్యక్ష పదవి
- జమ్మికుంట పట్టణ,మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తా
- తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తా
- నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు సలహాలు సూచనలతో యువతను చైతన్యం చేసి గ్రామ మరియు పట్టణ కమిటీలను ఎంపిక చేస్తా
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట మండల అధ్యక్షునిగా 21 మంది పోటీ చేయగా ఆ ఫలితాలను యువజన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డిసెంబరు 4 బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో 870 మెజారిటీ ఓట్లతో జమ్మికుంట పట్టణానికి చెందిన బుడిగె శ్రీకాంత్ హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల అధ్యక్షునిగా గెలుపొందడం జరిగింది.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…
ఇటీవల జరిగిన తెలంగాణ యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో 21 మంది పోటీ చేయగా, హోరా హోరీ పోటీలో తనకు యువతీ యువకులు విద్యార్థిని విద్యార్థులు అండగా నిలిచి 870 ఓట్ల మెజారిటీతో గొప్ప విజయాన్ని అందించారని తెలిపారు.
ఈ విజయం జమ్మికుంట మండల యువతీ యువకుల విద్యార్థిని విద్యార్థుల విజయమని నిత్యం వారి సేవలో నిమగ్నం అవుతానని బుడిగె శ్రీకాంత్ తెలిపారు.
నా గెలుపుకు సహకరించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.
మా ప్యానెల్ గెలుపులో భాగంగా, మా ప్యానెల్ జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జ్ తెలంగాణ ఉద్యమకారులు అన్నం.ప్రవీణ్ గారి కృషి కీలకమైందని శ్రీకాంత్ తెలిపారు.
ఓటింగ్ లో పాల్గొని మమ్మల్ని ఆదరించి, నన్ను ఆశీర్వదించిన ప్రతీ కార్యకర్తకు యువతీ యువకులకు, విద్యార్థిని విద్యార్థులకు ఆత్మీయులందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని శ్రీకాంత్ అన్నారు.
శ్రీకాంత్ రాజకీయ ప్రస్థానం
2013 డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి BC విద్యార్థి సంఘంలో పని చేస్తూ, విద్యార్థుల హక్కుల కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు.
నిత్యం సమాజ సేవలో నిమగ్నమై అందరికీ అందుబాటులో ఉంటూ, సమాజంలో మంచి మార్పుకై కృషి చేస్తున్నట్టు తెలిపారు. విధాన సభ ఎన్నికల ముందు హుజురాబాద్ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబు గారి సమక్షంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని భావించి, కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేస్తూ శ్రమించడం జరుగుతుందని అన్నారు. ఇంత గొప్ప బాధ్యత యువత తనకు అందించి పెద్ద బాధ్యతను తన ముందు ఉంచారని ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో, జమ్మికుంట మండల వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేస్తానని, ఏ సమస్య ఉన్నా యువతకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రణవ్ బాబు గారి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీకాంత్ తెలిపారు.
నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు గారి ఆదేశాలతో త్వరలోనే జమ్మికుంట పట్టణ మరియు మండలంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తామని మండలంలోని 20 గ్రామాలు, పట్టణంలోని 30 వార్డులలో యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేస్తామని బుడిగె శ్రీకాంత్ తెలిపారు.
బ్యాలెట్ పోరులో భారీ మెజారిటీతో బుడిగె శ్రీకాంత్ విజయం
జమ్మికుంట పట్టణానికి చెందిన నిరుపేద యువకుడు… జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో గెలుపొందడం కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా సర్వత్ర సంచలనమైంది. దసరా పండుగ అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ఎన్నికలను జరిపించాలని ఎ.ఐ.సి.సి నిర్ణయించి దాదాపు రెండు నెలల పాటు ఈ ప్రక్రియను కొనసాగించింది. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం నుండి బుడిగె శ్రీకాంత్ సహా 20 మంది జమ్మికుంట మండల అధ్యక్ష పదవికి పోటీ పడగా తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది, 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు గల యువతీ యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంటుంది.ఈ ప్రక్రియ దాదాపు రెండు నెలల సమయాన్ని ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది,ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలన్నర రోజులు గడిచింది, స్క్రూట్ ని తదితర ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం డిసెంబర్ 4 బుధవారం సాయంత్రం ఢిల్లీ లోని ఏ.ఐ.సి.సి ఎన్నికల విభాగం తెలంగాణ రాష్ట్ర ఫలితాలను ప్రకటించింది.అందులో జమ్మికుంట మండలం అధ్యక్షునిగా బుడిగె శ్రీకాంత్ కు 870 మెజారిటీతో ప్రత్యర్థులపై విజయం సాధించినట్లు వెల్లడించారు. యువత మద్దతుతో ముందు అనుకున్నట్టుగానే శ్రీకాంత్ కు ఇంత భారీగా ఓట్లు పోల్ అవడం జరిగింది. ఈ ఓట్లు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీ యొక్క తమ ప్యానెల్ అభ్యర్థుల గెలుపుకు కూడా ఎంతగానో దోహదపడిందని చెప్పారు. ఈ పదవికి ఎంపికైన బుడిగె శ్రీకాంత్ మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారని యువజన కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేశారు.
జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా తాను ఘనవిజయం సాధించడానికి సహకరించిన తమ మార్గదర్శి, హుజూరాబాద్ దిక్చూచి నియోజకవర్గ పార్టీ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తన గెలుపుకు కృషి చేసిన తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ కి, సహచర ఆత్మీయులకు,పట్టణ వార్డు,గ్రామాల ఇంచార్జులకు, కార్యకర్తలకు,యువతీ యువకులకు,విద్యార్థిని విద్యార్థులకు,పార్టీ సీనియర్ నాయకులకు,ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.జమ్మికుంట మండల పరిధిలో గల సుమారు 50 గ్రామ,వార్డులలో యువజన కాంగ్రెస్ కమిటీలను నియమించడానికి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.జమ్మికుంట మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరచడానికి అకుంఠిత దీక్షతో కృషి చేయడం ద్వారా ప్రణవ్ బాబు నాయకత్వంలో పార్టీనీ బలోపేతం చేస్తామని. వచ్చే ఎన్నికలలో హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ఇప్పటి నుండే పునాదులు వేసి ప్రతీ ఒక్కరినీ చైతన్యం చేస్తామని బుడిగె శ్రీకాంత్ ప్రకటించారు.
