కమలాపూర్ లో అలరించిన ముగ్గుల పోటీలు

By dhanadhannews.com

  • ఆకట్టుకున్న ముగ్గుల ప్రదర్శన
  • ఆరు గ్యారెంటీలపై అద్భుత ముగ్గులు
  • ప్రత్యేక అతిథిగా పాల్గొన్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్

కమలాపూర్/ధనాధన్ న్యూస్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో స్టార్ ఫ్రెండ్స్ యూత్ ఆద్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం ఆద్యంతం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి ముగ్గుల పోటీలో పాల్గొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఆరు సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా రంగుల హరివిల్లులో తీర్చిదిద్దారు.ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులను ప్రణవ్ అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి,సంప్రదాయాలను తెలియజేసేలా వేసిన ముగ్గులు అందర్నీ ఆకట్టుకున్నాయని ఆరు గ్యారెంటీలను అమలుచేశామని అలాగే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ముగ్గుల పోటీ నిర్వాహకులు పాల్గొన్నారు.