- ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి
హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ వాణి దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా తెలంగాణ వాణి దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరించారు.
అనంతరం ఉన్న ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిరుస్తూ నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజల మన్నలను పొందుతున్న దినపత్రిక తెలంగాణ వాణి దినపత్రిక అని తెలిపారు. ప్రశ్నించడమే పత్రిక సహజ లక్షణం అని ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి దినదిన అభివృద్ధి చెందాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్ మామునూరి సంపత్, ఆర్.సి వెంకటేశ్వర్లు,రూలర్ రిపోర్టర్ రాజు, టౌన్ రిపోర్టర్ మహేందర్ రెడ్డి,వివిధ మండలాల రిపోర్టర్స్, సైదాపూర్ మండల రిపోర్టర్ మహమ్మద్ రఫీ,యాదగిరి,పరశురాములు,తదితరులు పాల్గొన్నారు.
