అపార్‌ ఐడీ నమోదు వేగవంతం చేయాలి

By dhanadhannews.com

  • మండల విద్యాధికారి మంతెన హేమలత

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ప్రతి విద్యార్థి యొక్క అపార్‌ ఐడీ వివరాలను యూడైస్‌ ప్లస్‌లో నిక్షిప్తం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జమ్మికుంట ఇంచార్జ్ మండల విద్యాధికారి మంతెన హేమలత  పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు.. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని  ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు సందర్శించారు..ఈ సందర్భంగా మండల విద్యాధికారి హేమలత మాట్లాడుతూ ఒక విద్యార్థి ఒక దేశం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూడైస్‌ ప్లస్‌ విధానంలోకి విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని, విద్యార్థుల సర్వే అపార్‌ ఐడీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. విద్యార్థులందరికీ తప్పనిసరిగా అపార్‌ ఐడీ ఉండాలన్నారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణివ్వడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల విద్యార్హత, విద్యపై సమగ్ర వివరాలను సేకరిస్తుందన్నారు. అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థుల అపార్‌ ఐడీని నూరుశాతం జనవరి 31లోగా నమోదు పక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.