ఇసుక మాఫియా దొంగలు మీరు

By dhanadhannews.com

  • దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది బిఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి
  • పదేండ్లు రాష్ట్రంలో ఇసుక మాఫియా చేసింది బిఆర్ఎస్ పార్టీ
  • కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ప్రజలే బిఆర్ఎస్ నాయకులను తరిమి కొడతాం
  • ఒక పిచ్చి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటలను నమ్మి మాజీ మంత్రి ఆగం అవుతున్నరు
  • తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి

జమ్మికుంట/ధననాధన్ న్యూస్: కొబ్బరికాయల దొంగేవడు అంటే భుజాలు తడుముకున్నట్లు బీఆర్ఎస్ నాయకుల వ్యవహార తీరు ఉందని పత్తి కృష్ణా రెడ్డి తెలిపారు.ఆదివారం రోజున తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియాను మొదలు పెట్టిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మాణ లోపంతో కుంగిపోయిన చెక్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే బాంబులతో కూల్చేశారని మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. జమ్మికుంట మండలం తనుగుల శంభుని పల్లి గ్రామం పరిధిలోని మానేరుపై టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న హయాంలోనే చెక్ డాం నిర్మాణం జరిగిందని కమిషన్లకు కక్కుర్తి పడి నాణ్యత పాటించకుండా మానేరు వాగుపై చెక్ డ్యాం నిర్మించి నేడు కాంగ్రెస్ పార్టీ వల్లనే కూలిందని దొంగ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని రైతులకు సాగునీరు కరెంటు ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఉచిత కరెంటు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని అన్నారు. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆనాడు కానీ ఈనాడు కానీ ఇసుక అమ్ముకున్న దాఖలు లేవని గుర్తు చేశారు. వావిలాల జమ్మికుంట రోడ్డు ధ్వంసం కావడానికి అనేకమంది అమాయకమైన ప్రజలు చనిపోవడానికి ఇసుక మాఫియా అనే కారణమని ఆ ఇసుక మాఫియాను నడిపించింది బిఆర్ఎస్ ప్రభుత్వం అన్న సంగతి ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బాంబులు పెట్టి పిలిచారని పేల్చారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.గతంలో మానేరు వాగు పైన కొండపాక విల్లాసాగర్ గ్రామాలలో నిర్మించిన చెక్ డ్యాములు కూలిపోయాయని గుర్తు చేశారు.ఒక పిచ్చి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటలను నమ్మి మాజీ మంత్రులు ఆగం అవుతున్నరని అన్నారు.చెక్ డ్యాం నిర్మాణం లోపం వలన కూలి పోయిందని చెక్ డ్యామ్లను నాసిరకంగా నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని వారు ఎంతటి వారైనా కాంగ్రెస్ పార్టీ సహించబోదని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పత్తి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్, మార్కెట్ వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఇల్లందకుంట టెంపుల్ చైర్మన్ ఇంగిలే రామారావు, పట్టణ మహిళ అధ్యక్షురాలు పూదరి రేణుక, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..