- జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ సూచించారు.బుధవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తదితర అవసరమైన పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.
సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రవి, ఏఎస్ఐ సంపత్తో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.