క్లినికల్ కార్డియాలజీ ఫెలో షిప్ పూర్తి చేసిన డాక్టర్ శ్రీనివాస్ కు ఘన సన్మానం

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11:హుజురాబాద్ కు చెందిన డాక్టర్ పోతరాజు శ్రీనివాస్ ఇటీవల ఫెలో షిప్ ఇన్ క్లినికల్ కార్డియాలజీ పూర్తి చేసిన సందర్భంగా గురువారం హుజురాబాద్ పెరిక సంఘం నాయకులు హుజురాబాద్ లోని శ్రీ దుర్గ హాస్పిటల్ లో డాక్టర్ శ్రీనివాస్ ను  మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పుష్ప గుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మీస రమేష్,బండి రమేష్,అంకతి శ్రీనివాస్, ఆకుల వెంకటరాజం,భారత ప్రభాకర్, భారత రజనీకాంత్,ముక్కెర కనకయ్య,పోతరాజు వీరయ్య,ఉగ్గె పరమేశ్వర్,మీస తిరుమలేష్, పోతరాజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.