సాధారణ బదిలీల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతనంగా వచ్చినటువంటి ఎక్సైజ్ సీఐ మాధవిలత,ఎస్సై సౌమ్యలను సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు మండలాల పరిధిలో ఉన్న గీత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని,గీత కార్మికులకు ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు పై అధికారులతో మాట్లాడి ప్రమాద బారిన పడిన కార్మికునికి న్యాయం చేసేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమములో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాడగొని బుచ్చయ్య గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి నర్సయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెర్ల కొమురయ్య గౌడ్,యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,కోశాధికారి వీరస్వామి గౌడ్,జమ్మికుంట మండల అధ్యక్షుడు పూదరి విజయ గౌడ్,ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు దేవేందర్ గౌడ్,వీణవంక మండల అధ్యక్షుడు దొమ్మటి రాజమౌళి గౌడ్,సొసైటీ సభ్యులు,గౌడసంఘం నాయకులు పాల్గొన్నారు.
