పచ్చదనం పరిశుభ్రత,మానవ సంబంధాలపై అవగాహన కల్పించాలి

By dhanadhannews.com

ఎన్ఎస్ఎస్  వాలంటీర్లు ప్రజలకు పచ్చదనం పరిశుభ్రత  మానవ సంబంధాల అభివృద్ధిపై అవగాహన కల్పించాలని సైదాపూర్ ఎంపీపీ , ఎంపీటీసీల  పోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పిలుపునిచ్చారు.సోమవారం రోజున మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో సింగపూర్ లోని వీఎస్ఆర్  డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వేసవికాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ఎన్ఎస్ఎస్  వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజాన్ని రక్షించేది సమాజాన్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యత ( నేటి విద్యార్థులది) ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పైన ఉన్నదని గుర్తు చేశారు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపైన ఎన్ఎస్ఎస్ వాలంటర్లు అవగాహన కల్పించి ,ప్రజలను చైతన్యవంతుణ్ణి చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.సమాజంలో సేవా దృక్పథాన్ని , పరిసరాల పరిశుభ్రత,గురించి ఎన్ఎస్ఎస్ వాలంటర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని వారు అన్నారు.విఎస్ఆర్  డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వివిఎన్ హనుమకుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్పెషల్ ఆఫీసర్ గిరీష్,పంచాయతీ  సెక్రటరీ గాజుల శ్రీలక్ష్మి, తాజా మాజీ సర్పంచ్ కాయిత రాములు, ఉప సర్పంచ్ మేకల మల్లారెడ్డి. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, సింగిల్ విండో చైర్మన్ పాల్ సాని రామ్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గబిడ తిరుపతి,. ఎన్ఎస్ఎస్  ప్రోగ్రాం కమిటీ మెంబర్లు మాడుగుల  అశోక్, కూన కోమల,పోతిరెడ్డి హరీష్  పాల్గొన్నారు.