ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా ప్రత్యేక అధికారి

By dhanadhannews.com

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 20:సైదాపూర్ మండలంలోని వెన్కపల్లి,జాగిరిపల్లి గ్రామాలలో శనివారం రోజున మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెరువులలో పూడికతీత పనులను కమిషనర్ పంచాయతీరాజ్ కార్యాలయం హైదరాబాదు నుండి వచ్చిన కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి(ఎమ్జీఎన్అర్ఈజీఎస్ ) అభయ్ కుమార్  పరిశీలించారు.పని ప్రదేశంలో కూలీలతో ప్రత్యక్షంగా మాట్లాడారు.మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద చేపడుతున్న పనుల ద్వారా ఉపాధి హామీ కూలీలకు ఏ విధంగా చేయూతనిస్తోందో,పనులు జరుగుతున్న తీరును పరిశీలించినారు.ఈ పనిని గ్రామస్థాయిలో అందరు వినియోగించు కోవాలని కోరినారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి  శ్రీధర్,అదనపు డిఆర్డిఓ సంధ్యారాణి,ఎంపీడీవో,ఏపీవో,ఈసీ టిఏలు,పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ మొదలగు వారు పాల్గొన్నారు.