హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజరాబాద్ నివాసులు పట్టణ కేంద్రంలోని శిశు మందిర్ దగ్గర గల ప్రతాప్ వెంకటమ్మ- ఆదిరెడ్డి ల రెండవ కుమారుడు ప్రతాపు నాగరాజు వయసు 40 సంవత్సరాలు జీవనోపాధి నిమిత్తం హైదరాబాదుకు వెళ్లి సుతారిగా పనిచేస్తుండగా రెండు కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల గత శుక్రవారం రోజున మరణించాడు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత్యక్రియలు డైరెక్ట్ గా స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు.ఇప్పుడు 11 రోజుల కార్యక్రమం చేయలేని పరిస్థితిలో ఉండగా ఇంటి దగ్గరలో ఉన్న మునుగంటి రవీందర్ రిటైర్డ్ వర్క్ ఇన్స్పెక్టర్ ఎస్.ఆర్.ఎస్.పి 2000 రూపాయల నగదు మరియు గంగిశెట్టి జగదీశ్వర్ 25 కిలోల రైస్ బ్యాగు అందించారు.గతంలో వీరి కోడలు క్యాన్సర్ తో మరణించగా రవీందర్ మరియు జగదీశ్వర్ పదివేల రూపాయలు నగదు సహాయం చేశారు.దాతలు ముందుకు వచ్చి తోచిన సహాయం చేయాలని కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో వీధిలోని ప్రజలు పాల్గొన్నారు.
