సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్02:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లి గ్రామంలో ఆదివారం రోజున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.కుల పెద్దమనిషిగా గూళ్ల వెంకటయ్య,ప్రెసిడెంట్ గా నెల్లి శ్రీనివాస్,క్యాషియర్ గా నీల తిరుపతి,వైస్ ప్రెసిడెంట్ గా రొయ్యల శ్రీనివాస్, మెంబర్లు గా బొల్లి సురేష్,గూళ్ల అజయ్,పిట్టల కొమురయ్య,పిట్టల మొండయ్య,పెసరి సమ్మయ్య,నీల సమ్మయ్య లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నా ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ,అభివృద్ధికి తోడ్పడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమం అనంతరం ఎన్నికైన నూతన కమిటీకి సభ్యులందరూ కలిసి సాలువా కప్పి సన్మానించారు,స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు.
