ఘనంగా డాక్టర్ రమేష్ జన్మదిన వేడుకలు

By dhanadhannews.com

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన వైద్యరత్న, ప్రముఖ సీనియర్ వైద్యులు, యువ వైద్య కిషోరం డాక్టర్ తిప్పిరిశెట్టి రమేష్ జన్మదిన వేడుకలు  అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.గ్రామానికి చెందిన ప్రముఖులు,యువకులు,వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు భారీ సంఖ్యలో హాజరై డాక్టర్ రమేష్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.డాక్టర్ రమేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఎందరో రోగులకు తన వైద్య సేవలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు ఆకాంక్షించారు.గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల్లో వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.