హుజురాబాద్/ధనాధన్ న్యూస్: మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా,గ్రామీణ ప్రాంతాల్లోనీ మహిళ స్వయం సహాయక సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని,హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 3,952 లబ్ధిదారులకు 3 కోట్ల 83 లక్షల వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేసామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళ అభివృద్ధి ప్రాధాన్యతగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గృహలక్ష్మి,మహాలక్ష్మి లాంటి అనేక పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టామని ఇప్పుడు వడ్డీ లేని రుణాల నిధులు మంజూరుతో మహిళలకు మరింత చేయూతనిచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని అన్నారు.ఈ నిధుల మంజూరు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ,మహిళలు తమ వ్యాపారాలను,స్వయం ఉపాధి కార్యక్రమాలను మరింత విస్తరించుకోవడానికి దోహదపడుతుందని అన్నారు.
