- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్
కరీంనగర్ ఏప్రిల్08:ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు,మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.
సోమవారం రోజున పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డి ఆర్ డి ఓ ఉప్పుల శ్రీధర్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో ఉపాధిహామీ కూలీలకు మంచినీటి సౌకర్యం,నీడ సౌకర్యం కల్పించడంతో పాటు,ఓరెస్ ప్యాకేట్స్ పంపిణీ చేయాలని అన్నారు.అలాగే కూలీల పనుల సమయాన్ని 7 గంటల నుండి 11 గంటల వరకు కొనసాగించాలని ఎక్కువ సమయం వరకు చేయించడం వల్ల ఎండ దెబ్బ కొట్టి కూలీలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.దూర ప్రాంతాలకు వెళ్లే కూలీలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.
ఉపాధిహామీ పనులు జరిగే ప్రదేశాపై క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ చేయాలని,కూలీల ఇబ్బందులు తెలుసుకోవాలని,విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని గ్రామాల్లో12 గంటల వరకు పనులు చెపిస్తున్నారాని, ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కూలీలు ఇంటికి వెల్లే పరిస్థితి దాపురించిందని అన్నారు.ప్రభుత్వం ఉపాధిహామీ కూలీలకు పనికి ముందు పని అయిపోయిన తర్వాత రెండు సార్లు ఫోటో అప్లోడ్ చేసి పద్దతిని వేనిక్కి తీసుకోవాలని,వర్షాలు లేక వ్యవసాయేతర భూములు గట్టిగా మారాయని అట్టి ప్రదేశాల్లో కొలతలు పెట్టి కూలీలతో పనులు చేయించడం వల్ల భూమి గట్టిగా ఉండడం వల్ల కొలతల ప్రకారం పనులు చేయక సరైన వేతనం పడక కూలీలు శ్రమ దోపిడీకి గురవుతున్నారని,దీన్ని దృష్టిలో ఉంచుకుని కొలతలు లేకుండా పనులు కల్పించి కూలీలను ఆర్ధికంగా ఆదుకోవాలని,కిలో మీటర్ పైగా దూరం ఉన్న పని ప్రదేశాలకు వెళ్లేందుకు కూలీలకు రవాణా సౌకర్యం కల్పించాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్,జిల్లా నాయకులు ఎగుర్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
