
కోనారావుపేట/ధనాధన్ న్యూస్:
రైతులకు మెరుగైన పంట దిగుబడులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో Nuziveedu Seeds ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటపై రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం మంగళపల్లి గ్రామానికి చెందిన రైతు వెలిశాల నర్సయ్య వ్యవసాయ క్షేత్రంలో జరిగింది.
ఈ సందర్భంగా Winner NMH-8352 మొక్కజొన్న రకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి హాజరైన కరీంనగర్ ఏరియా మేనేజర్ నీలా రాజు మాట్లాడుతూ, నూజివీడు సీడ్స్ రైతు సేవలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమని తెలిపారు. Winner NMH-8352 రకం ఇతర రకాలతో పోలిస్తే అధిక దిగుబడి ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ రకానికి బలమైన వేరు వ్యవస్థ ఉండటం వల్ల పంట పడిపోకుండా నిలకడగా ఉంటుందని, గింజ బరువు కూడా ఎక్కువగా ఉండటంతో రైతులకు లాభాలు చేకూరుతాయని వివరించారు. నూజివీడు విత్తనాలు రైతులకు నాణ్యమైన దిగుబడులు అందిస్తాయని చెప్పారు.
ఈ క్షేత్ర ప్రదర్శనను సందర్శించిన రైతులు ఈ రకంపై ఆసక్తి చూపుతూ పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
అదేవిధంగా రాబోయే వానకాలం దృష్ట్యా పత్తి పంటలపై కూడా అవగాహన కల్పించారు. నూజివీడు సీడ్స్ అందిస్తున్న ఆధ్యా, విజేత, నవనీత్, అర్మిత పత్తి విత్తనాలు అధిక దిగుబడిని అందిస్తాయని తెలిపారు. ఈ రకాలు రసం పీల్చే పురుగులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు, నీటి ఎద్దడి మరియు వర్షపాతం మార్పులను కూడా తట్టుకునే గుణం కలిగి ఉన్నాయని చెప్పారు.
అలాగే ఇవి స్వల్పకాలిక పంటలు కావడంతో 80 శాతం పత్తిని మొదటి రెండు కోతల్లోనే సేకరించవచ్చని, తద్వారా యాసంగి సీజన్‌కు రెండో పంటను ముందుగానే సాగు చేయవచ్చని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు గుడిసె గంగరాజు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.