ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అధికారుల విచారణ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు ముత్యాల రమణారెడ్డి ఈజీఎస్ నిధులను ముందస్తు గా తీసుకొని స్వాహా చేశాడని ఆకునూరు గ్రామానికి చెందిన రావుల రాజిరెడ్డి సమాచార చట్టం ద్వారా సమాచారం తీసుకొని నిధులను ముందస్తు గా తీసుకొని గ్రామపంచాయతీలో జమ చేయలేదని,నిధులు దుర్వినియోగం చేశారని కలెక్టర్ ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్,జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు మంగళవారం రోజున ఆకునూరు గ్రామపంచాయతీ లో అధికారులు  విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో యాదగిరి మాట్లాడుతూ రమణారెడ్డి సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు 2021 సంవత్సరంలో రెండు లక్షల పన్నెండు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు మరియు 2021 సంవత్సరంలో 70,693 రూపాయలు ముత్యాల రమణారెడ్డి వాడుకోవడం జరిగిందని ఇప్పటికి కూడా తీసుకున్న నిధులు జమ చేయలేదని విచారణలో తేలింది. అయినప్పటికీ  పూర్తి విచారణ జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తెలిపారు.డ్రా చేసిన నిధులను రమణారెడ్డి నుండి రికవరీ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి,ఎంపిఓ బషిరొద్దీన్,ఏపీవో రాణి,టిఏ అశోక్,పంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డి,రావుల రాజిరెడ్డి ఉన్నారు.