పడాల రాహుల్ ప్యానెల్ దే ఘన విజయం

By dhanadhannews.com

  • కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా ముత్యం శంకర్
  • కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షునిగా పంజాల కృప సాగర్
  • మానకొండూర్ నియోజకవర్గం అధ్యక్షునిగా అట్ల అనిల్ ముదిరాజ్
  • చొప్పదండి నియోజకవర్గం అధ్యక్షునిగా వోడ్నాల యజ్ఞేష్ పటేల్
  • హుజూరాబాద్ నియోజకవర్గం అధ్యక్షునిగా చల్లూరి రాహుల్

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా గత సెప్టెంబర్ నెలలో జరిగిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలు మండల,నియోజకవర్గం,జిల్లా రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహించారు.ఎన్నికల పలితాలు డిసెంబర్ 4 న విడుదల అయ్యాయి.
ఆ పలితాలలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పడాల రాహుల్ విజయం సాధించారు
కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గా ముత్యం శంకర్ విజయం సాధించగా కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు గా పంజాల కృప సాగర్ , మానకొండూర్ నియోజకవర్గం అధ్యక్షులు అట్లా అనిల్ ముదిరాజ్ , చొప్పదండి నియోజకవర్గం అధ్యక్షులు వోడ్నాల యజ్ఞేష్ పటేల్,హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు గా చల్లూరి రాహుల్ ఘన విజయం సాధించారు.4 నియోజకవర్గాల్లో 20 మండల అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే అందులో 18 మండల అధ్యక్షులు పడాల రాహుల్ ప్యానెల్ గెలిచింది.ఈ సందర్భంగా పడాల రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం అయిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని,తనకి ఓటు వేసి గెలిపించిన తెలంగాణ రాష్ట్ర యువతకి కృతజ్ఞతలు తెలియజేశారు.తాను ఒక్కడినే కాకుండా తన ప్యానెల్ సభ్యులు అందరూ విజయం సాధించడం లో కీల పాత్ర పోషించి విజయం అందించడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్,డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ పురుమల్ల శ్రీనివాస్,హుజూరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు,కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు లకి కృతజ్ఞతలు తెలియజేశారు.తనతో పాటు తన ప్యానెల్ సభ్యులు అంత యువతకు అండగా ఉంటామని,కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్తాం అని,తాను రాష్ట్ర స్థాయి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హత ఉన్న  ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు.ముత్యం శంకర్ మాట్లాడుతూ  గత పోయిన 4 ఏళ్లు పడాల రాహుల్ గారు జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం అనేక ధర్నాలు,దీక్షలు,ఆందోళనలు మరియు యువతకు చేసిన సేవ తన పనితీరుని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమం గురించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేస్తూ ఉంటానని తెలిపారు ,
గెలుపు ఓటములు సహజం తనతో పాటు పోటీ చేసిన ప్రతీ ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతామని,కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పోరాటం చేస్తాం అని తెలిపారు.తమకి మద్దతు ఇచ్చి వోట్ వేసిన కరీంనగర్ యువతకు ధన్యవాదాలు తెలియజేశారు.