నిప్పుంటుకుని తాటి వనం దగ్ధం

By dhanadhannews.com

  • ఉపాధి కొల్పోనున్న గౌడ కులస్తులు

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)జూన్4 : ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామ సరిహద్దులోని తాటి వాననికి ప్రమాదవశాత్తు సాయంత్రం  నిప్పుంటూకుని తాటి వనం దగ్ధం ఐన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గీత కార్మిక సంఘం నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని పక్కనే ఉన్న ఎల్లమ్మ దేవస్థానంలోని బోరు మోటర్ ద్వారా మంటలని చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపు కాకపోయేసరికి ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలని అదుపులోకి తీసుకున్నారు..ఈ ప్రమాదంలో సుమారు 20కల్లు నిచ్చే తాటి చెట్లు దగ్ధం అయ్యాయని దీనితో తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని గౌడ సంఘం అధ్యక్షులు దేశిని మహేష్ తెలిపారు..ఇట్టి విషయంలో విచారణ చేసి  గీతా కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు బొమ్మడి తిరుపతి, పర్కాల మురళి, నాగపురి సంపత్, బొమ్మడి సతీష్, పర్కాల తిరుపతి,అనగోని రమేష్,బాలసాని శివ, బొమ్మిడి వెంకటేష్, రమేష్, వడ్లకొండ జలపతి, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు..