ఉల్లాసంగా ఉత్సాహంగా పుడ్ షేరింగ్ డే

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని లోటస్ పాండ్ స్కూల్ లో శనివారం ఫుడ్ షేరింగ్ ఆక్టివిటీ నిర్వహించామని పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు తెలిపారు..ఈ సందర్భంగా విద్యార్థులకు సమతుల్య ఆహారం,పౌష్టికాహారం గురించి,ఆహార పదార్థాలను ఇతరులతో పంచుకోవడం గురించి అవగాహన కల్పించారు..తల్లిదండ్రులు పిల్లలకు అనేక రకాలైన భోజన పదార్థాలు తయారుచేసి పంపించారు..ఈ కార్యక్రమంలో నర్సరీ నుండి 10వ తరగతి విద్యార్థులకు భోజన సమయంలో తెచ్చుకున్న భోజన పదార్థాలు ఒకరికొకరు పంచుకున్నారు..టీచర్లు వాటిని మొదట అందంగా అలంకరించి తర్వాత పిల్లలకు పంచిపెట్టారు..ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు,డైరెక్టర్ నడిపెల్లి శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ తాబ్సమ్,టీచర్లు పద్మ, శ్రీవేని,సుమలత,స్వరూప,భవాని,కవిత,లావణ్య, రజిత,ఉదయ శ్రీ,హసీన,సురేష్,రాజశేఖర్, దేవరాజ్,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.