- ముంజాల సంపత్ తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించి మంచి పేరు సంపాదించారు
- హుజురాబాద్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఊకంటి మహేందర్
హుజురాబాద్ మార్చ్ 31:హుజురాబాద్ ప్రధాన తపాల కార్యాలయంలో పోస్ట్ మేన్ గా విధులు నిర్వర్తిస్తున్న ముంజాల సంపత్ పదవి విరమణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన సంపత్,రమాదేవి దంపతులను బంధువులు, సహచర ఉద్యోగులు పూల మాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు.హుజురాబాద్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఊకంటి మహేందర్ మాట్లాడుతూ పోస్టల్ కార్యాలయంలో సంపత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమై తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారని కొనియాడారు.సహచర ఉధ్యోగులతో అన్న దమ్ముల్లా మెదిలే వారని గుర్తు చేశారు.పదవి విరమణ అనేది సహజమని,ప్రభుత్వ ఉద్యోగులు ఎదో ఒక రోజు పదవి విరమణ చేయక తప్పదన్నారు.వారి శేష జీవితం వందేళ్లు విరజిల్లాలని కోరారు. సహోద్యోగులు,బందువులు పాల్గొని ఆయనతో అనుబంధాన్ని నెమరేసుకున్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు రవి కుమార్,జక్కు రజినికాంత్,పి.అమర్నాథ్ రెడ్డి,ఎస్.వేణుగోపాల్, ఎమ్ శ్రీనివాస్,బి.ప్రభాకర్, ఎ.చంద్రమోహన్,హరీష్, శివాజి,రాము,స్వామి,సతీష్,సత్యం,రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
