సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దేనపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ రమేష్ సింగ్ తండ్రి రాధా కిషన్ సింగ్ వయస్సు 46,ఆదివారం రోజున విధి నిర్వహణలో భాగంగా హుజరాబాద్ ఆర్టీసీ డిపో నుండి ఉదయం హైదరాబాద్ వెళ్తుండగా మార్గం మధ్యలో గుండె పోటు రావడంతో,బస్సులో ఉన్న ప్రయాణికులు హాస్పిటల్స్ లో తరలించారు,చికిత్స పొందుతూ మృతి చెందాడు,ఆయనకు భార్య మంజుల,ముగ్గురు కుమార్తెలు అర్చన,అఖిల,అన్విత ఉన్నారు.ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపించారు.ఆర్టీసీ ఉద్యోగులు,గ్రామ ప్రజలు,సంతాపం తెలిపారు.ఆయన కుటుంబానికి ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్పొరేషన్ అన్ని విధాల ఆదుకోవాలని,కుటుంబ సభ్యులు,బంధువులు,గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
