గమనిస్తూ వానకాలం గడిపేయ్..
కనిపెడ్తూ ప్రమాదాలు అరికట్టేయ్..

By dhanadhannews.com

అనపురం రమేశ్ ఎంఏ

రచయిత.

ఈగలతో ఇబ్బందులుంటయ్
ఈగ కాలం కదా
దోమలతో దొబ్బులాటలుంటయ్
దోమ కాలం కదా
కప్పలు బెక బెక మంటయ్
బురుద కాలం కదా
వానపాములు తిర్గుతయ్
వాన కాలం కదా
నేల మీద ఎప్పుడు నడిచినట్టే
నడువకు చూసుకుంట నడువ్
లేకపోతే కాళ్ళు రెక్కలు ఇర్గుతయ్
పాకురు పట్టి వుంటుంది కదా నేల జాగ్రత్త
రైతులు పొలాల వద్ద కరెంట్ పోల్లకాడ పైలం
పాతిండ్లు గోడలపొంటి పెద్దచెట్ల తోటి భద్రం.
సైకిల్ బైక్ ల ప్రయాణం చేసేటోల్లు నిమ్మలం
వాన కాలమెల్లేదాక మురికి నీళ్ళు ఈగలు దోమలు
కట్లపాములు నాగుపాములు నల్లతేళ్ళు జెర్రిలు విష పురుగులతో ప్రమాదాలు పొంచి ఉంటయ్
తినేదేదో వేడి వేడిగా చేసుకొని తినేసెయ్
గమనిస్తూ వానాకాలం గడిపేయ్
కనిపెడ్తూ ప్రమాదాలు అరికట్టేయ్.