ఆర్థిక సాయం అందజేసిన గల్ఫ్ సేవా సమితి

బుగ్గారం / జగిత్యాల జిల్లా, ( చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల గుండెపోటుతో గల్ఫ్‌లో కన్నుమూసిన సాటి గల్ఫ్ కార్మికుడు పులి మహేష్  కుటుంబానికి సోమవారం రూ. 72,100 (డెబ్బై రెండు వేల వంద రూపాయలు) ఆర్థిక సాయం అందజేశారు. వారి వంతు సహాయంగా గల్ఫ్ కార్మికులందరం కలిసి తల కొంత డబ్బు సేకరించి మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా […]

జమ్మికుంట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా లెంకలపల్లి శరత్ కుమార్ విజయం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 28: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన జమ్మికుంట ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో లెంకలపల్లి శరత్ కుమార్ ఘన విజయం సాధించారు.జమ్మికుంట ఆర్యవైశ్య సంఘంలో మొత్తం 1,800 మంది ఓటర్లు ఉండగా, వారిలో 792 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక జమ్మికుంట పోలీసుల భద్రత మధ్య నిర్వహించబడ్డాయి.అధ్యక్ష పదవికి నలుగురు అభ్యర్థులు పోటీ పడగా, […]

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 28: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, కనీస వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కరీంనగర్ జిల్లా మహాసభ సీనియర్ నాయకుడు బొజ్జ సాయిలు […]

ఇల్లందకుంటలో సీఎం,మంత్రులు, వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండల కేంద్రంలో నూతన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన తహశీల్దార్ కార్యాలయ […]

జమ్మికుంటలో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, జూన్ 28: భారత మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం జమ్మికుంట పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు, విద్యా రంగం, విదేశాంగ విధానంలో ఆయన చేసిన కృషిని […]

‘చాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 27: జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి బోగోజి ముఖేష్ కన్నా ఆధ్వర్యంలో నిర్వహించిన “చాత్రోన్ కీ గూంజ్” కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలోని విద్యార్థులు, యువత, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ […]

ప్రజల పక్షాన పోరాడే సీపీఐని బలోపేతం చేద్దాం

కరీంనగర్/ధనాధన్ న్యూస్, జూన్ 27: ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై సంఘటితంగా ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.శనివారం గుంటూరుపల్లి గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ […]

పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, వారికి రావాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులో విఫలమైందని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి విమర్శించారు.బుధవారం జమ్మికుంటలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు డీఏలను విడుదల చేస్తామని, పీఆర్‌సీని ప్రకటించి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదని […]

“తవ్వారు..వదిలేశారు..! స్కూల్ పక్కనే ప్రమాదాలకు ఆహ్వానం”

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: కరీంనగర్ నగరంలోని 40వ డివిజన్ హనుమాన్‌నగర్‌లో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం రహదారి పక్కన గుంతలు తవ్వి, ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేయడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు విమర్శించారు. బ్లూబెల్స్ పాఠశాల సమీపంలోని సందు రహదారి వెంట డ్రైనేజీ పనులు చేపట్టి, ప్రజలకు హెచ్చరికలు లేకుండా వదిలేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, స్థానిక ప్రజలు […]

హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: రాష్ట్రంలోని అన్ని రంగాల హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బొమ్మకల్ సిమెంట్ గోదాముల హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సిమెంట్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత […]