సర్వేకు రేటు కట్టిన సర్వేయర్‌కు ఏసీబీ షాక్

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 5:మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. భూమి సర్వే నిర్వహించేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వేయర్‌తో పాటు ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన రైతు చుంచు మహేందర్‌కు సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామ శివారులో మూడు ఎకరాల భూమి […]
ఎండదెబ్బతో గొర్రెల కాపరి మృతి

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 5: మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎండదెబ్బ తగిలి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లి శ్రీశైలం (29) గురువారం ఉదయం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఎండ ప్రభావంతో తల తిరగడం, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తన తండ్రి పిల్లి తిరుపతికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో తిరుపతి గ్రామానికి చెందిన […]
మరమ్మతులకు నోచుకోని తుమ్మలచెరువు కట్టు కాలువ

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 4: సైదాపూర్ మండలంలోని తుమ్మలచెరువు కట్టు కాలువ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రెండు చోట్ల దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదని వెంకేపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మునుపాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న వర్షాకాలానికి ముందే చెరువు కట్టు కాలువకు మరమ్మతులు చేపట్టకపోతే భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. మరోసారి భారీ వర్షాలు కురిస్తే తుమ్మలచెరువు కట్ట పూర్తిగా […]
ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైదాపూర్ మండలంలోని గ్రామాల్లో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడుతూ..దశాబ్దాల కల నెరవేరిన రోజు తెలంగాణ ఆవిర్భావ దినమని పేర్కొన్నారు. ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. “మన రాష్ట్రం – మన పాలన” అనే లక్ష్యంతో […]
పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెళ్లిన మాజీ సర్పంచుల అరెస్ట్

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 1: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సైదాపూర్ మండల మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రేగుల సుమలత అశోక్ మాట్లాడుతూ, తమ పదవీకాలంలో గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు […]
క్రికెట్ ఫీవర్..పోలీసుల స్పెషల్ నిఘా..!

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్,మే 31 :ఈ రోజు జరగనున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏసీపీ వాసంశెట్టి మాధవి తెలిపారు. మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి బెట్టింగ్ కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు, గొడవలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏసీపీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, ప్రజా రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. […]
ధనాధన్ న్యూస్ లో ప్రచురితమైన కథనానికి స్పందన

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న గోనెసంచుల సమస్యపై ధనాధన్ న్యూస్ తెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. రైతులకు గోనెసంచులు అందించేందుకు నిరాకరించిన యజమాని, వార్త ప్రచురితమైన అనంతరం మంగళవారం ఉదయం వెంటనే సంచులు అందజేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు “మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ రైతుల సమస్యను పట్టించుకోని యజమాని వైఖరిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ధనాధన్ న్యూస్‌లో కథనం వెలువడిన తర్వాత […]
మక్క కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆగ్రహం

సైదాపూర్/ధనధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పది రోజుల్లో మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్థానిక టెండర్ యజమాని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సంచుల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజులు గడుస్తున్నా పంట కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. […]
ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్

సైదాపూర్/ధనాధన్ న్యూస్,మే 25:ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ… మరోవైపు ఇసుక ఆన్‌లైన్ సమస్యలు లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఇసుక అందుబాటులో లేక ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఇసుక ఆన్‌లైన్‌లు అందుబాటులో లేకపోవడం, అనంతరం ఒక్కసారిగా భారీ సంఖ్యలో అనుమతులు జారీ కావడంతో ట్రాక్టర్లు, కార్మికులు […]
ప్రణాళికాబద్ధంగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గురువారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి, వారి తల్లిదండ్రులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. ఆకునూరు పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ […]
