ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులో వార్డ్ యూత్ అధ్యక్షులు పుల్లూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో 133వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి మరియు కేక్ కట్ చేసి ఘనంగా జరిపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్,వెంకటేశ్వర్లపల్లి సర్పంచ్ బోయిని కుమార్,పల్లపు రవి,శనిగరపు రవి,తిరుపతి శ్రీనివాస్,మిడిదొడ్డి శంకర్,రామ్ రాజబాబు,పుల్లూరి శ్యాంమూర్తి,దాసారపు వేణు మరియు వార్డు సభ్యులు రమేష్,రవి,విజయ్,కాజా తన్వీర్,రాజేందర్,శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏ ఐ ఆర్ ఆర్ ఎఫ్) జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షులు  దాసరి రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ వేడుకల్లో దాసరి రాజేశ్వర్ పూలే మరియు అంబేద్కర్ ఆశయాలను వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి మొయినుద్దీన్,ట్రెజరర్ బి.విద్యాసాగర్,ఎండి ఖాదర్ ఖాన్,టి.వెంకటస్వామి డి.సారంగపాణి కొమురయ్య,దేశరాజు పల్లి రాజయ్య,ఎస్.మల్లేశంలతో పాటు సభ్యులందరూ పాల్గొన్నారు.