సకాలంలో వర్షాలు కురవాలని గ్రామదేవతలకు జలాభిషేకం

సైదాపూర్,జూలై 17 (ధనాధన్ డిజిటల్ న్యూస్): సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఊరేగింపు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సంప్రదాయం ప్రకారం రోకలి బండకు కప్పను వస్త్రంతో కట్టి గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి గడపకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. “కప్పతల్లి… కప్పతల్లి… కడవడే నీళ్లు” […]
జగిత్యాల రైతు బజార్ వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్

జగిత్యాల,జూలై 13 (ధనాధన్ న్యూస్): జగిత్యాల పట్టణంలోని రైతు బజార్ ముందు రహదారిపై రైతులు కూరగాయలు విక్రయించడం వల్ల గత కొంతకాలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. ముఖ్యంగా విద్యానగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు, సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై స్పందించిన ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశం సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, మున్సిపల్ సిబ్బందితో […]
ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

శంకరపట్నం, జూలై 8 (ధనాధన్ న్యూస్): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జన్మదిన వేడుకలు, ఎమ్మార్పీఎస్ ఉద్యమ సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని శంకరపట్నం మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని కేశవపట్నంలో ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు కనుకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అంబేద్కర్ నగర్ గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి యామునూరి నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దళిత […]
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నల్లబ్యాడ్జీల నిరసన

జగిత్యాల, జూలై 7(ధనాధన్ న్యూస్): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీజీపీఈజేఏసీ (TGPEJAC) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాలలోని టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) డివిజన్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో […]
గౌన్లవానీకుంట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్): జమ్మికుంట నూతన తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం సుధాకర్‌ను 5వ వార్డు కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 5వ వార్డులోని గౌన్లవానీకుంట ఆక్రమణలకు గురవుతోందని, వెంటనే రెవెన్యూ సర్వే నిర్వహించి కుంట హద్దులు నిర్ధారించి, చుట్టూ రక్షణ గోడ (బౌండరీ) ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని వార్డు ప్రజల తరఫున తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపై స్పందించిన తహసీల్దార్ […]
బాస్ స్కీమ్ విద్యార్థుల ప్రవేశాలపై వివాదం..చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల వినతి

జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ హైస్కూల్‌లో బాస్ (BAS) స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులను పాఠశాలలో కొనసాగించకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు తల్లిదండ్రులు మండల విద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. తల్లిదండ్రుల కథనం ప్రకారం, ఈ విద్యా సంవత్సరంలో బాస్ స్కీమ్‌కు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి అందలేదని పేర్కొంటూ, విద్యార్థులను కొనసాగించాలంటే ఫీజులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. ఫీజులు చెల్లించకపోతే తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్పించుకోవాలని సూచిస్తున్నారని […]
ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజేందర్‌కు ఘన సన్మానం

జమ్మికుంట,జూలై 1 (ధనాధన్ న్యూస్): కరీంనగర్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజేందర్‌ను జమ్మికుంట మండల మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం నాయకులు బుధవారం ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎబూషి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆకుల రాజేందర్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే నాయకుడని అన్నారు. బీసీ వర్గాల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి […]
SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మెట్‌పల్లి,జూన్ 30(ధనాధన్ న్యూస్: మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రక్రియపై అవగాహన సదస్సుల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. సత్తక్కపల్లి, రాజేశ్వరరావుపేట, చెర్లకొండాపూర్, జగ్గాసాగర్, ఆత్మనగర్, రామలచక్కపేట గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయి […]
ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌బీ డీఎస్పీ వెంకటరమణకు ఘన సన్మానం

జగిత్యాల,జూన్ 30(ధనాధన్ న్యూస్): జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీ వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వీకేబీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఘన వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో వెంకటరమణ ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించి […]
ఆర్థిక సాయం అందజేసిన గల్ఫ్ సేవా సమితి

బుగ్గారం / జగిత్యాల జిల్లా, ( చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల గుండెపోటుతో గల్ఫ్‌లో కన్నుమూసిన సాటి గల్ఫ్ కార్మికుడు పులి మహేష్ కుటుంబానికి సోమవారం రూ. 72,100 (డెబ్బై రెండు వేల వంద రూపాయలు) ఆర్థిక సాయం అందజేశారు. వారి వంతు సహాయంగా గల్ఫ్ కార్మికులందరం కలిసి తల కొంత డబ్బు సేకరించి మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా […]
