ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

నడికూడ, ధనాధన్ న్యూస్ : నడికూడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మహిళ సమైక్య భవనాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నడికూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని,ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి […]
నడికూడ మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

నడికూడ, ధనాధన్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు నడికూడ మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. సద్దుల బతుకమ్మ వేడుకలను ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు.ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో ఆటపాటలు ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలతో పల్లె వాతావరణం మారుమోగగా, పూల సోయగాలతో గ్రామాల్లో పండుగ శోభ సంతరించుకుంది. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో […]
నడికూడ యువత గొంతుగా పని చేస్తా

నడికూడ,ధనాధన్ న్యూస్ : నాపై నమ్మకం,విశ్వాసం ఉంచి నడికుడ మండల బీజేవైఎం అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పగడాల కాళీ ప్రసాద్,రావు పద్మ, హనుమకొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు,నా ఆత్మీయ మిత్రుడు పున్నం వేణు, హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కోలాను సంతోష్ రెడ్డి,నడికూడ మండల బీజేపీ అధ్యక్షులు ఎరుకల దివాకర్ లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు,ఆశయాలు, దేశభక్తి స్ఫూర్తితో యువతను ఏకం చేస్తూ,కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి […]
ఘనంగా బతుకమ్మ వేడుకలు

హనుమకొండ,ధనాధన్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా గ్రామాలలోని మహిళలు,ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు,ఆటపాటలతో పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా నానే బియ్యం బతుకమ్మను జరుపుకున్నారు. పూల పండుగ బతుకమ్మ మహిళల ఆత్మీయత, ఐక్యతకు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని,బతుకమ్మ ఆట,పాటలతో గ్రామాల్లో సందడి నెలకొంది.
శభాష్..సర్పంచ్ సబ్

నడికూడ, ధనాధన్ న్యూస్ : హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కుడ్ల మలహల్ రావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు కోతుల నుండి విముక్తి కల్పించాలని కోతులు పట్టే వారిని పిలిపించి కోతులను పట్టించారు.వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ వారికి ఏ ఆపద వచ్చిన ఆదుకుంటానని కోతుల వల్ల సమస్యలు ఉన్నాయని ప్రజలు వివరించడంతో తక్షణమే స్పందించి కోతులను పట్టించడం పట్ల శభాష్.. సర్పంచ్ మలహలరావు సాబ్ […]
హుస్సేన్ పల్లిలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

పరకాల, ధనాధన్ న్యూస్: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.బతుకమ్మ పండుగలో తొలి రోజైన ఎంగిలిపూల బతుకమ్మను గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి,ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ,కోలాటాలు,ఆటపాటలతో సందడి చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం […]
మీ ఙ్ఞాపకాలు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాయి

నడికూడ, ధనాధన్ న్యూస్ : హనుమకొండ జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మొగిలి విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి మస్టర్ డిమాండ్ నమోదు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న నడికూడ మండల ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో విద్యావతి,ఈసీ రజనీకాంత్‌తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు మొగిలి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ […]
నడికూడ మండల ఉత్తమ టీచర్లకు సన్మానం

నడికూడ, ధనాధన్ న్యూస్ : “డా. సర్వేపల్లి రాధాకృష్ణన్” గారి జయంతిని పురస్కరించుకొని నడికూడ మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు అధ్యక్షత వహించగా,ఎంపీడీవో రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నడికూడ మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన 16 మంది ఉత్తమ ఉపాధ్యాయులను […]
నర్సక్కపల్లిలో పోషణ మాసం కార్యక్రమం

నడికుడ,ధనాధన్ న్యూస్: పోషణ మాస కార్యక్రమంలో భాగంగా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామంలోని ఒకటి,నాలుగు అంగన్వాడి సెంటర్ జిపి స్థాయిలో కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల సీడీపీఓ స్వాతి పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీలో అందించే సేవల గురించి,గర్భిణీల తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పిల్లల పోషకాహారం, ఆకుకూరల ప్రాముఖ్యత, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే అనారోగ్యాలు,వాటి వల్ల కలిగే నష్టాల గురించి, అలాగే రక్తహీనత,తక్కువ బరువు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. స్కూల్ హెడ్ […]
పోషకాహారంతో తల్లి, బిడ్డల ఆరోగ్యం

నడికూడ, ధనాధన్ న్యూస్: నడికూడ మండల కేంద్రంలోని నడికూడ సెక్టార్ పరిధిలోని నడికూడ-4వ సెంటర్, గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ హేమలత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే ఈసీసీఈ డే కార్యక్రమానికి […]
