సిరిసేడు హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు ప్రభుత్వ హైస్కూల్‌లో ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ప్రైజ్ మనీ అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఫస్ట్ సాధించిన విద్యార్థికి రూ.5,000, స్కూల్ సెకండ్ వచ్చిన విద్యార్థికి రూ.3,000, స్కూల్ థర్డ్ స్థానం పొందిన విద్యార్థికి రూ.2,000 నగదు బహుమతులను అందించారు. విద్యార్థులు […]
ప్రవేట్ పాఠశాల వద్దు..గవర్నమెంట్ పాఠశాల ముద్దు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా “జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ చేపట్టారు.ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం బొట్ల రామస్వామి మాట్లాడుతూ, ప్రతి తల్లిదండ్రులు తమ బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు […]
అదనపు కట్నం కోసం వేధింపులు.. నలుగురిపై కేసు నమోదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 10: అదనపు కట్నం తీసుకురావాలని కోడలిని వేధించిన భర్తతో పాటు అత్తమామలు, బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడిపల్లి గ్రామానికి చెందిన ఇగ్గేటి అనూష (26)కు గత ఏడాది ఉల్లంపల్లి గ్రామానికి చెందిన బుల్లి అజయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు కుటుంబ సభ్యులు ఎకరం భూమి, రూ.8 లక్షల నగదు, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించినట్లు తెలిపారు. పెళ్లి […]
కరీంనగర్ బంద్‌పై కాంగ్రెస్ ఫైర్.. బీజేపీ-బీఆర్ఎస్‌పై వొడితల ప్రణవ్ తీవ్ర విమర్శలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 9:బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు పాల్పడుతున్నాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆరోపించారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికా లేక రాజకీయ బలప్రదర్శనకా ఈ బంద్ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బయటకు పరస్పరం […]
“అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే చర్యలు తప్పవు: కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరిక”

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం తీవ్రంగా ఖండించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ద్వారా విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఆయన మాట్లాడుతూ, రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత ఆరోపణలు, ఉద్రిక్తతలకు దారితీసే వ్యాఖ్యలు మానుకోవాలని కౌశిక్ రెడ్డికి హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో ప్రశాంత […]
గడ్డం సమ్మయ్య కి దళిత రత్న అవార్డు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా దళిత రత్న అవార్డు ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించబడింది.మహనీయులు బాబు జగజీవన్ రామ్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ బైరి వెంకటేశం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎస్సీ 52 కులాల సంఘం అధ్యక్షుడు రైళ్ల లక్ష్మీ నరసయ్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఇందిరానగర్‌కు చెందిన […]
తెలంగాణ జన సమితి పార్టీ 4వ ప్లీనరీ విజయవంతం చేయండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ మే 02: తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముక్కెర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం పోరాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి అని […]
బత్తుల లక్ష్మీనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ పక్షవాతం బారిన పడిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం హనుమకొండలోని అజరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను ఆయన సందర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన సతీష్ కుమార్, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకుంటారని నమ్మకం వ్యక్తం చేస్తూ, ఎలాంటి ఆందోళన […]
సైదాపూర్‌లో అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం

సైదాపూర్/ధనధాన్ న్యూస్ ఏప్రిల్ 28: సైదాపూర్ మండలంలోని విశాల సహకార ప్రకృతి సంఘం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల వారీగా పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు […]
పోషణ్ పక్వాడ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహణ

సైదాపూర్/ధనధాన్ న్యూస్,ఏప్రిల్ 25:కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐసిడిఎస్ సీడీపీవో ఎం. సుగుణ మాట్లాడుతూ, ప్రీ-స్కూల్ మేళ, గర్భిణి స్త్రీల కోసం శ్రీమంతం కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించామని తెలిపారు. అలాగే ఆరు నెలలు నిండిన శిశువులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు, చిన్నారుల కోసం గ్రాడ్యుయేషన్ డేను కూడా విజయవంతంగా జరిపినట్లు వెల్లడించారు. ఈ […]
