ఘనంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు

By dhanadhannews.com

సైదాపూర్ (ధనాధన్ న్యూస్ )జూన్ 02:సైదాపూర్ మండల కేంద్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణ&బీసీ సంక్షేమశాఖ  పొన్నం ప్రభాకర్  ఆదేశాల మేరకు ఘనంగా  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  దొంత సుధాకర్  ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి అవతరణ దినోత్సవం కావడంతో ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిచడం జరిగింది. జాతీయ జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంచిపెట్టారు అమరవీరులను స్మరిస్తూ నివాళి అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు