తెలంగాణ జన సమితి
పార్లమెంటరీ కమిటీ నియామకం

By dhanadhannews.com

  • కరీంనగర్ పార్లమెంటరీ కమిటీ ఇంచార్జి గా ముక్కెర రాజు నియామకం

పార్లమెంటరీ ఇంచార్జి ముక్కెర రాజు

పార్లమెంటరీ కో ఆర్డినేటర్ అరికిల్ల స్రవంతి

కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే 06:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంటరీ కమిటీ ఇంచార్జి గా ముక్కెర రాజు,కో ఆర్డినేటర్ గా జగ్గారెడ్డి,అరికిల్ల స్రవంతి, కర్రే సతీష్ యాదవ్,మోరే గణేష్,పల్లెర్ల శ్రీనివాస్,రమేష్ లను నియమించడం జరిగింది.తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో జన సమితి పార్టీ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలుపుతున్న సందర్బంగా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గెలుపుకి ఈ కమిటీ కృషి చేయాలని రాష్ట్ర కమిటీ సూచించింది.