- రేపు చేవెళ్ల నుండి మరో రెండు పథకాలకు సు”ముహూర్తం”
- హుజురాబాద్ నియోజకవర్గ మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు
- హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్
హుజురాబాద్,ధనాధన్ న్యూస్:
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆరు గ్యారంటిల్లో ప్రతీ హామీని నేరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోపే 4 గ్యారంటీలను అమలు పరుస్తున్నమని ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కి నిదర్శనమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంఛార్జి ప్రణవ్ అన్నారు.రేపటి నుండి మరో రెండు పథకాలను ప్రవేశపెడుతున్నామని సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఈ పథకాలను తెలంగాణ ప్రజలు,హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలనీ కోరారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే రెండు స్కీములను అమలుచేశామని,మహిళలకు ఉచిత బస్ సౌకర్యం,ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు పెంపు చేశామని,గత ప్రభుత్వం మాదిరిగా ఇచ్చిన హామీలను విస్మరించే ప్రభుత్వం కాదని ప్రస్తుతం ప్రజా పరిపాలనలో నడుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు.రేపు చేవెళ్ల సభ ద్వారా రెండు గ్యారంటీలను ప్రియాంక గాంధీ చేత ప్రారంభిస్తున్నామని ఇది శుభపరిణామనీ తెలిపారు.గతంలో గ్యాస్ బండ గుదిబండగా తయారయ్యిందనీ సామాన్య ప్రజలకు సమస్యగా ఉన్న సిలిండర్ ధరను కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 లకే ఇస్తున్నామని,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వం రైతులను దగా చేసిందని,రుణమాఫీ చేస్తామని చేయలేదని తద్వారా రైతులు అవస్థలు పడ్డారని గుర్తుచేశారు.రాబోయే రోజుల్లో రైతులకు రుణమాఫీ గురించి స్పష్టమైన ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేస్తారని,దానితో పాటు రైతుకు పెట్టుబడి సహాయం కింద అందజేసే రైతు భరోస పథకాన్ని కూడా త్వరలో అందజేస్తామని తెలిపారు. ఇది పూర్తిగా రైతు,కార్మిక,కర్షక ప్రభుత్వమని ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటిలను అమలు చేస్తామని తెలిపారు.
