శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన వోడితల ప్రణవ్

By dhanadhannews.com

వీణవంక,ధనాధన్ న్యూస్:

వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలోని  శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ శుక్రవారం హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవాలయాల విశిష్టత ప్రజలకు తెలిసే విధంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బల కిషన్ రావు,మాజీ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి,మైనారిటీ సెల్ వీణవంక మండల అధ్యక్షుడు ఎండి ఎజాస్,  మల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి,చల్లూరు గ్రామ అధ్యక్షుడు పెద్ది సంపత్ రెడ్డి,పంజాల అనూష – సతీష్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్,నాయకులు సతీష్,ప్రశాంత్,గంట కిరణ్ రెడ్డి, టేకుల శ్రావణ్,మీడియా నియోజక వర్గ ఇంచార్జీ మిడిదొడ్డి రాజు,కొండ నవీన్,విష్ణువర్ధన్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.