యదేచ్ఛగా మట్టి అక్రమ రవాణా-పట్టించుకోని అధికారులు

By dhanadhannews.com

  • అక్రమ కట్టడాలను కట్టడి చేయలేకపోతున్న మున్సిపల్ అధికారులు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 27:హుజూరాబాద్ శివారులో సర్వే నెం,496 లో అక్రమ మట్టి ( మొరం) రవాణా చేస్తున్న గానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ ఆరోపించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ శివారులో సిర్సపల్లి శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్న గానీ అధికారులు చోద్యం చూస్తున్నారు.అనేక పిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగి పోతున్నారని యదేచ్చగా వారి ఇష్టానుసారంగా మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తే అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరుపుతున్నారని అధికారులు పట్టించుకోపోవడం వలన రాత్రింబవళ్ళు బయటి వెంచర్లకు మట్టి తరలిస్తున్నారని తహసీల్దార్ కి ఆర్. డి.వో (ఆర్డివో)కి  సమాచారం ఇచ్చినా చర్యలు లేవని అన్నారు.అదే విధంగా హుజూరాబాద్ పట్టణంలో 2418 సర్వే నెంబర్ అక్రమంగా ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదుతో మున్సిపల్ అధికారులు విచారణ జరిపి ప్రహరి గోడ ను కూల్చివేశారని మళ్ళీ ఆ గోడను అనుమతులు లేకున్నా మళ్ళీ నిర్మించారని అధికారుల మాటలను సైతం బేఖాతరు చేస్తున్నారని తెలిపారు.ఈ వెంచర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని అన్నారు.వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.