- ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రామాండ్లపల్లి యుగంధర్
కరీంనగర్(ధనాధన్ న్యూస్)జూన్14: సామ్రాజ్యవాదుల గుండెల్లో దడ పుట్టించిన విప్లవ దృవతార చేగువేరా అని,ఆయన ఉద్యమ పోరాట స్పూర్తితో నేటి విద్య, ఉపాధి,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై ఉద్యమించాలని యుగంధర్ పిలుపునిచ్చారు.
శుక్రవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేగువేరా 96వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా ఎఐవైఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మండ్ల పెళ్లి యుగంధర్ మాట్లాడుతూ 1928 జూన్ 14న అర్జెంటీనాలో జన్మించిన చేగువేరా వైద్య, ఇంజనీరింగ్ విద్యలను అభ్యసించి ఆనాటి కాలంలో లాటిన్ అమెరికా సామ్రాజ్య వాదం ప్రజలపై చేస్తున్న దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన వీరుడని, క్యూబా స్వాతంత్ర్య ఉద్యమంలో కాస్ట్రో తో పాల్గొని ఆ దేశానికి స్వాతంత్ర్య రావడం ముఖ్య పాత్ర పోషించి ఆ దేశానికి మంత్రి అయ్యారని,బొలివియా దేశ స్వాతంత్ర్య కోసం క్యూబాలో మంత్రి పదవిని త్యాగం చేసి బొలివియా దేశం కోసం అమెరికా సామ్రాజ్యంపై అసమాన పోరాటం చేశారనికొనియాడారు.చేగువేరా ఉద్యమ పోరాట పటిమకు భయపడిన అమెరికా సామ్రాజ్య వాదులు దొంగ దెబ్బతో 1967 అక్టోబర్ 9న చంపడం జరిగిందని,చనిపోయిన చేగువేరా మృతదేహం దగ్గరకు వెళ్లి చూడడానికి అమెరికా సైన్యానికి చెమటలు పడ్డాయని,చే చనిపోయి కూడా అమెరికాను ఒకరోజు పాటు భయపెట్టాడని,అంతటి పోరాట చరిత్ర కలిగిన మహోన్నత వ్యక్తి చేగువేరా అని,అసమానతలు లేని సమాజం కోసం పోరాడిన విప్లవ వీరుడు చేగువేరాని,ఆ ఉద్యమ కారుని పోరాట స్పూర్తితో విద్య వ్యతిరేక విధానాలపై, దేశంలో ఉన్న అసమానతలపై,ఆకలి లేని,పేదరికం లేని,అత్యాచారాలు లేని సమాజం కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఏఐవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి చెంచల మురళి,ప్రభాకర్,రాజు నాయక్,తిరుపతి,రాధికా, లావణ్య,అనుశ్రీ,రజిని,భవాని,భాస్కర్,శ్రీకాంత్,చైతన్య,రమేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
