- ముఖ్య అతిధిగా పాల్గొన్న జడ్పీటీసీ శ్రీరామ్ శ్యాం
జమ్మికుంట ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన క్రి.శే.పరకాల తిరుపతి గౌడ్ నాలుగవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు జమ్మికుంట మండలం కేంద్రంలోని స్పందన అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండల జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యాం, సిరిసేడు మాజీ సర్పంచ్ రఫీ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వీరి చేతుల మీదుగా అనాధ పిల్లలకి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి భార్య పరకాల రేణుక,కుమారుడు సాయి కుమార్,సిరి సైడ్ మాజీ ఎంపిటిసి భీనవేనా సదయ్య,సిరిసేడు గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు దేశిని మహేష్,జిల్లెల్ల దేవేందర్ రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
