హుజురాబాద్ నియోజకవర్గం లోని పైలెట్ ప్రాజెక్టు అయినటువంటి దళితబందును రెండవ విడతను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పూర్తిస్థాయిలో మంజూరు చేస్తుందో జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన ద్వారా తెలపాలని హుజురాబాద్ నియోజకవర్గ దళితబందు సాధన సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.గత బి అర్ ఎస్ ప్రభుత్వం దళితబందు పూర్తిస్థాయిలో మంజూరు చేయడంలో విఫలం అయిందని రెండవ విడత కోసం 18 నెలలుగా ఎదురు చూస్తున్న దళితులకు అన్యాయం చేశారని,ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిన దళితులపై చొరవ తీసుకొని రెండవవిడతను సకాలంలో మంజూరు చేసి దళితుల జీవితాలలో వెలుగు నింపాలని పభుత్వాన్ని కోరారు.
ఇక్కడున్న కొంతమంది నాయకులు దళితబందు కోసం పోరాటం చేస్తున్న మా పై మా దళిత జాతి నాయకులనే ఉసిగోలిపేలాగా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.మీకు మా దళితులపై చిత్తశుద్ధి ఉంటే దళితబందు రెండవ విడత సకాలంలో వచ్చే విధంగా మీ మంత్రుల దృషికి తీసుకెళ్లి ఒత్తిడి చేయాలి.కానీ అడ్డుకొనే ప్రయత్నం చేస్తే ఉద్యమం ఇంకా ఉదృతం చేయడానికి దళితులంతా ఏకమై ఉన్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి సభ్యుల కోలుగూరి సురేష్,మంద రాజేష్,కోలుగూరి నరేష్,రామంచ రాకేష్,అకినపల్లి ఆకాష్,రామంచ శ్రీకాంత్,ఎర్ర వంశీ,కనకం రత్నాకర్, దసరాపు నాగరాజు,రక్షిత్,తదితరులు పాల్గొన్నారు.
