కార్పొరేషన్ల ఏర్పాటు పట్ల హర్షం

By dhanadhannews.com

  • సీఎం రేవంత్ రెడ్డి,మంత్రుల చిత్రపటాలకు పాలభిషేకం

ఎన్నో ఏళ్ల ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయం అని తెలంగాణ ఓసి జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గూడూరి స్వామిరెడ్డి (లోక్సత్తా) పేర్కొన్నారు. గూడూరి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని దాటవేయగా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అభినందనలు అన్నారు.సుమారుగా 10 ఏళ్ల నుండి గ్రామ, మండల, జిల్లా,రాష్ట్ర స్థాయిలలో కార్పొరేషన్ల కొరకు రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్రలు, రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో, ఓసీ జెఎసి ఆధ్వర్యంలో కరపత్రాలు, వినతిపత్రాలు, దీక్షలు ఎవరికి ఇబ్బంది కలగకుండా శాంతియుత పోరాటాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఓసిలోని పేదలు అనుభవిస్తున్న బాధలను వివరించడం జరిగింది. ఓసిలలోని అందరినీ ఒక ఐక్యతకు తీసుకురావడం జరిగింది. సభలు సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఓసి కంకణ బద్ధుడై తమ సొంత ఖర్చులతో ప్రతి సమావేశానికి హాజరై రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర కాబినెట్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓసి లందరం అండగా ఉంటామని, ప్రతి కార్పొరేషన్కు పదివేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని,ఈ శుభ దినాన్ని పురస్కరించుకొని ఎల్కతుర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ని సన్మానం చేయడం జరిగిందని తెలిపారు.ఆ తర్వాత హుజురాబాద్లో ముఖ్యమంత్రి, మంత్రి పొన్నం ప్రభాకర్,కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రాణవ్ ల చిత్ర పాటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి,రాష్ట్ర కోఆర్డినేటర్ కామెడీ సతీష్ రెడ్డి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కంకణాల సరోజన, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు విజయరెడ్డి,రాష్ట్ర సలహాదారు జనార్దన్ రెడ్డి,రాష్ట్ర సలహాదారు ఎక్కటి సంజీవరెడ్డి,నాయకులు బండ లక్ష్మిరెడ్డి,నల్ల కొండాల్ రెడ్డి, కందుల సమ్మిరెడ్డి, కే చరణ్ రెడ్డి,లింగారెడ్డి, ఉషా నందిని,సామల సురేష్ రెడ్డి,పెంచికల్పెట్ సర్పంచ్ మామిడి తిరుపతిరెడ్డి,రూపురెడ్డి లక్ష్మి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.