మంత్రి పొన్నం ఆవేశం స్టార్ కాదు..ఆత్మ గౌరవ స్టార్..

By dhanadhannews.com

  • ఆత్మగౌరవ స్టార్ కాబట్టి స్వరాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించాడు
  • మంత్రి ని బర్త రఫ్ చేయించే అర్హత,విమర్శించే స్థాయి  నీకు ఉందా?
  • ఆత్మగౌరవ స్టార్ కాబట్టి బీసీ కుల గణన చేయిస్తున్నాడు
  • ఆత్మగౌరవ స్టార్ కాబట్టి అక్కా చెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాడు

హుజురాబాద్ మార్చ్ 23:కరీంనగర్ లో మీడియా సమావేశంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  పై ఒక ప్రకటనలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఉంటే చెక్కులు నువ్వు పంచలేదా,అప్పుడు మీకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా?
మా మంత్రి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పార్లమెంట్ లో ప్రాణాలకు తెగించి కొట్లడారు.విద్యార్థి ఉద్యమాల దశ నుంచి మంత్రిగా ఎదిగి వచ్చిన నాయకుడు మా మంత్రి పొన్నం ప్రభాకర్ అని తెలిపారు.

తెలంగాణ ఉద్యమం లో కొట్లాడిన నాయకుడు పొన్నం అయితే  మహబూబాబాద్ లో ఉద్యమరులపై రాళ్ళు విసిరి కాల్పులు జరిపింది నువ్వు కాదా అని,పక్క రాష్ట్ర సినిమా డైలాగులు ఇక్కడ పనిచేయవని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్  అన్నారు.
భాష గురించి గొప్పగా మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న తమిళసై గురించి తాను మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని,భాష గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని,ముందు తన భాష గురించి తాను ఆలోచించుకోవాలని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని మిగతా వాటిని కూడా అమలు చేస్తామని,కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం పథకం ఇంకా ప్రారంభం కాలేదని ప్రారంభం కానీ దాన్ని కూడా హుజురాబాద్ ప్రజల్లో మెప్పు పొందడానికి,తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారే,తప్ప నిజంగా ప్రజల పట్ల ప్రేమ లేదని అన్నారు.పొన్నం ప్రభాకర్ సానుభూతిపై గెలవలేదని నిఖార్సైన ఉద్యమ కారుడని చెప్పుకొని గెలిచాడని అన్నారు.ఉద్యోగాల విషయంలో చిత్తశుద్ధి అంటే కాంగ్రెస్ పార్టీదని ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో 30వేలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు.