అమ్మ చూపు సజీవం

By dhanadhannews.com

  • నేత్రదానంతో ఇద్దరికి చూపు
  • అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
  • నేత్రాలను సేకరించిన ఎల్.వీ.పీ టెక్నీషియన్ లక్ష్మణ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ఆ అమ్మ మృతి చెందినప్పటికీ,ఆమె చూపు మాత్రం సుజీవంగానే ఉంది.నేత్రదానంతో ఇద్దరు అంధులకు కుటుంబ సభ్యులు చూపును ప్రసాదించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడెం గ్రామ నివాసి అయిన ముక్కా స్వరూప హార్ట్ ఎటాక్ తో తెల్లవారుజామున మరణించడం జరిగింది.వారి సమీప బంధువైన వెంకన్న సదాశయ ఫౌండేషన్ సభ్యుడు నేత్రదానంపై అవగాహన కల్పించగా ఒప్పుకోవడంతో,కరీంనగర్ జిల్లా సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు నరహరి ఆధ్వర్యంలో వరంగల్ ఎల్.వీ.పీ టెక్నీషియన్ లక్ష్మణ్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఐ బ్యాంక్ పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భర్త ముక్కా కృష్ణమూర్తి, కుమారుడు కోడలు శ్రవణ్ కుమార్, శిరీష లకు, కూతుర్లు అల్లుండ్లు శైలజ,రాజు,సరిత, వివేక్ లకు అవగాహన కల్పించిన డీలర్ వెంకన్నకు
సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి,ముఖ్య సలహాదారులు నూక రమేష్,గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి,ప్రచార కార్యదర్శి వాసు,నరహరి,లగిశెట్టి చంద్రమౌళి, మరియు బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.