- నీట్ పరీక్ష మరల నిర్వహించాలి
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: నీట్ మరియు నెట్ పరీక్షల ప్రశ్న పేపర్ల లీకేజీలను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ లో భాగంగా హుజురాబాద్ మండలం మరియు, జమ్మికుంట మండల వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఇమ్రాన్,ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా అద్యక్షులు రామారపు వెంకటేష్, సహాయ కార్యదర్శి కేశబోయిన రాము,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్,జిల్లా కార్యదర్శి అభిలాష్,గాలి నరేష్,పిడిఎస్యూ జిల్లా కోశాధికారి కెంసరపు రవితేజ మాట్లాడుతూ నీట్ మరియు నెట్ పరీక్ష పేపర్ల లికేజ్ వలన నష్టపోయి ఆందోళన చెందుతున్న విద్యార్థులకు,తల్లిదండ్రులకు పూర్తి స్థాయి భరోసా కల్పించడంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని,పేపర్ లీకేజీ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చే సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని,పేపర్ లీకేజీ వలన నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని,నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్.టి.ఏ ను రద్దు చేయాలని,పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని,పేపర్ లీకేజీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు,విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని,నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు రోహిత్,రాహుల్, సన్నీ,నాగా,సందీప్,కార్తీక్,నితిన్,అభిలాష్,నరేష్, వంశీ,రంజిత్,సందీప్,సోహేల్,తదితరులు పాల్గొన్నారు.
