హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డ్ (NQAS)ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిందని జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి తెలిపారు.గురువారం ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత తో పాటు వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ ను కలిశారు.ఈ మేరకు అందుకున్న అవార్డును కలెక్టర్ కు అందజేశారు.95 శాతం అచీవ్‌మెంట్ సాధించినందుకు ఏరియా హాస్పిటల్ కు అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.భారతదేశంలోనే టాప్ 3లో నిలవడం కరీంనగర్ కు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుజాత,ఏరియా ఆసుపత్రి సూపర్టిండెంట్ రాజేందర్ రెడ్డి,ఆర్ఎంఓ సుధాకర్ రావు,వైద్య విధాన పరిషత్ అధికారులు పాల్గొన్నారు.
