స్మార్ట్ సిటీ నిధుల్లో సునీల్ రావు 10 కోట్ల కమిషన్

By dhanadhannews.com

  • నీ దోపిడీ పై మున్సిపల్ కార్యాలయం ముందు బహిరంగ చర్చకు సిద్ధం
  • కార్పొరేషన్ చైర్మన్ సునీల్ రావు కి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్ల సవాల్

కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కుంటుపడుతుందని మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడడాన్ని మేయర్ సునీల్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.నగర అభివృద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని సునీల్ రావు అంటున్నారని,వాస్తవానికి సునీల్ రావు అవినీతిని చూసి నగర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వారు ఏద్దేవా చేశారు.కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులలో అవినీతి జరిగిందని బిఆర్ఎస్ పార్టీ మాజీ మేయర్,ఇతర కార్పొరేటర్లు ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా అని కార్పొరేటర్ కాశేట్టి శ్రీనివాస్ ఫిర్యాదు పత్రాలను చూపిస్తూ ప్రశ్నించడం జరిగింది.స్మార్ట్ సిటీలో అవకతవకలు జరగలేదన్న విషయాన్ని సునీల్ రావు ప్రజల వద్దకు వచ్చి నిరూపించుకోవాలని,కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాడు ఎమ్మెస్సార్ వెంట,టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంగుల కమలాకర్ వెంట తిరిగి ఇప్పుడు బండి సంజయ్ తో అంటకాగుతున్న సునీల్ రావుకు రాజకీయ నీతి లేదని,శివారు గ్రామాల అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ నిధులను ఎందుకు వెచ్చించలేదని కాశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు.ఎక్కడైతే అవినీతికి అవకాశం ఉంటుందో అక్కడ మాత్రమే స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు నిర్వహించి అవినీతి సొమ్మును దండుకున్నారు.ఈ విషయంపై మున్సిపల్ గేటు ముందు బహిరంగ చర్చకు మేము సిద్ధం ఉన్నామని,కమిషన్లు తీసుకోకుండా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ము సునీల్ రావుకు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు చేశారు.కార్పొరేటర్ లను పట్టించుకోకుండా కేవలం ఎక్కడైతే కమిషన్లు దొరుకుతాయో అక్కడ అనుమతులు ఇవ్వడం జరుగుతుందనేది వాస్తవం కాదా అని వారు ఏద్దేవా చేశారు.అవినీతిపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.సీఎం అస్సూరెన్స్ నిధులతో చేపట్టిన పనుల్లో పెండింగ్ బిల్స్ ఇప్పిస్తామని కాంట్రాక్టర్ల నుండి కమిషన్లు ఆశించింది వాస్తవం కాదా అని అన్నారు.ప్రజలు ఆశించిన అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మేము పార్టీ మారడం జరిగిందని దళితులమైన మాపట్ల రాజకీయ కక్ష చూపిస్తూ మా డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని 22వ డివిజన్ కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్ తెలిపారు.ఉన్నత వర్గానికి చెందిన సునీల్ రావు బీసీలు దళితులపై ఉద్దేశపూర్వకంగానే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని,చిన్న కాంట్రాక్టర్లు సునీల్ రావు టార్చర్ భరించలేక బిల్లుల కోసం ఆయనకి కమిషన్లు ఇవ్వలేక ఏడుస్తున్నారని తెలిపారు.డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరామని మాపై ఆరోపణలు చేస్తున్న సునీల్ రావు నాడు కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఎంతకు అమ్ముడు పోయారని ఏద్దేవా చేశారు.20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని మేము పార్టీ మారడం జరిగిందే తప్ప డబ్బుల కోసం కాదని గంట కళ్యాణి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కరెంటును 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సంక్షేమ పథకాలను మీ పార్టీ కార్పొరేటర్ల డివిజన్లో ప్రజలు వినియోగించుకోవడం లేదా అని గత ప్రభుత్వంలో మీరు మేయర్ గా ఉండి ఎందుకు నగరంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేయలేదని తెలిపారు.ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండి పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావుని విమర్శించే స్థాయి రాజకీయ వ్యభిచారి అయినటువంటి సునీల్ రావుకు లేదని హెచ్చరించారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు సరిల్ల ప్రసాద్,పిట్టల శ్రీనివాస్,ఆకుల నరసయ్య, వైద్యుల అంజన్ కుమార్,కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.