మీరు చల్లని బీర్ ప్రియులా..జర ఇది చూడండి

By dhanadhannews.com

  • చల్లని బీర్ లో నల్లని పురుగు
  • బీర్లలలో వస్తున్న పురుగులు..జంకుతున్న బీర్ ప్రియులు
  • హుజురాబాద్ లోని ఆర్ఆర్ వైన్స్ బీర్ లో దర్శనమిచ్చిన పురుగు
  • బీర్లలలో కూడా నకిలీ బీర్లు వస్తున్నాయనే అనుమానం
  • బీర్లో పురుగు పై అబ్కారి శాఖ అధికారుల మాట ఏంటో

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బీర్ ప్రియులకు బీర్ తాగాలంటే జంక్ పుడుతుంది. చల్లని బీర్లో హాయిగా దర్శనమిస్తున్నాయి పురుగులు. పక్కా ప్రణాళిక తో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్న బీర్లలో పురుగులు దర్శనమివ్వడంతో మద్యం ప్రియులు జడుసుకుంటున్నరు.తాజాగా హుజురాబాద్ పట్టణంలోని ఆర్ఆర్ వైన్స్ లో బీర్ కొని మజాగా తాగుతున్న బీర్ ప్రియునికి పురుగు దర్శనం ఇవ్వడం తో ఖంగు తిన్నాడు.జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లి కి చెందిన పుల్లూరి సంపత్ హుజురాబాద్ కి పని మీద వెళ్లి తిరుగు ప్రయాణం లో పట్టణ శివారులో ఆర్ఆర్ వైన్స్ లో బీర్ కొనుక్కొని తాగుతుండగా బీర్ లో పురుగు కనపడడం తో వైన్ షాప్ సిబ్బంది ని సంప్రదించగా అది కంపెనీలో జరిగిందని, మాకు ఎలాంటి సంబంధం లేదని, మీకు ఇంకో బీర్ ఇస్తాను తాగి వెళ్ళమని చెప్పడంతో సంపత్ అవాక్కు అయ్యాడు.పురుగు వచ్చిన బీర్ తాగి సంపత్ వాంతులు చేసుకున్నట్లు తెలిపాడు.ఈ సందర్బంగా సంపత్ మాట్లాడుతూ బీర్లలో పురుగులు రావడంతో ప్రజలు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉందని, ఈ సంఘటన పై అబ్కారి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న బీర్ల కంపెనీలపై చర్యలు తీసుకోవాలని సంపత్ కోరారు.