రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

By dhanadhannews.com

  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
  • సంబరాలకు ముస్తాబవుతున్న రైతు వేదికలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ నియోజకవర్గం లోని రైతు వేదికలు సంబరాలకు ముస్తాబవుతున్నాయని,ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని,రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  వోడితల ప్రణవ్ అన్నారు.గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు,రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రేపు రైతుల ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు.ఈ కార్యక్రమాన్ని టీవీ మానిటర్ ద్వారా రైతులు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించేలాగా వ్యవసాయ అధికారులు రైతు వేదికల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.లక్ష రూపాయల రుణమాఫీ  ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది.ఈ కార్యక్రమం విజయవంతం చేయుట కొరకు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్  కాంగ్రెస్ నాయకులకు దిశ నిర్దేశం చేస్తున్నారు.రైతు ఉత్సవాల సంబరాల్లో భాగంగా రైతులకు కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేస్తారు.హుజురాబాద్ నియోజకవర్గం లోని పలు గ్రామాల రైతు వేదికలకు వచ్చిన రైతులతో రుణమాఫీ సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ పాల్గొంటారు.