- యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సికి పాలభిషేకం
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు బ్యాండు భాజాలతో, టపాసులు కాల్చి మిఠాయిలు పంచినృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన మరియు యువజన కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.రైతు రుణ మాఫీకి కృషిచేసిన జిల్లాకు సంబంధించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్,మానకొండూర్ శాసనసభ్యులు డిసిసి అధ్యక్షుడు డాక్టర్.కవ్వంపల్లి సత్యనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఒకే విడుతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు.ఈరోజు చేసిన లక్షలోపు రైతు రుణమాఫీ ద్వారా కరీంనగర్ జిల్లాలో 37,745 రైతులు మంది రైతులు రుణమాఫీ లబ్ది పొందారని తెలిపారు.పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ 28 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయలేకపోయారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకే విడతలో 31 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేస్తుందని ఏకకాలంలో రైతు రుణ మాఫీ చేయడం పట్ల ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయని అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పని మడమ తిప్పని విధంగా ఆగస్టు లోపే రుణ మాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని ఏకకాలంలో మాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాట ప్రకారం దమ్ముంటే హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రైతు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతుకు చేరే విధంగా కాంగ్రెస్ నాయకులు తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేష్,టేకుల శ్రావణ్,పంజాల సతీష్,బండ నవీన్,లంకదాసరి గంగరాజు,జంగ అనిల్,గడ్డం రాఘవేంద్ర,ఇప్పలపల్లి చంద్రశేఖర్,ముక్క మహేందర్,చల్లూరి విష్ణువర్ధన్,ముక్క రమేష్ జన్ను ప్రసాద్,బిట్ల సాయి తేజ,కొండ్ర నాగరాజు,కొండ్ర బాలు,రాజేష్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.
