క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు

By dhanadhannews.com

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మడిపల్లి  గ్రామంలో క్లోరోఫీల్ ఆర్గానిక్స్ వారు పత్తి  మరియు వరి పొలాలపై అవగాహన సదస్సు  నిర్వహించారు.వరిలో వచ్చే మొగి పురుగు,అగ్గి తెగులు నివారణకు మరియు వరిలో అధిక పీలికలు రావడానికి వసుధ 1కేజీ  మరియు క్లెన్సర్ 4కేజీ మోగి పురుకు గుళికలు వరిలో వచ్చే అగ్గి తెగులు + జింక్ + పురుగు నివారణకు మరియు పత్తి పంటలో రసం పీల్చే పురుగులకు  కాయ తొలుచు పురుగులకు గోల్డ్ లీఫ్,విటమిన్ ఎస్పీ ప్రొడక్ట్స్  రైతులు వాడుకోవాలని మరియు కంపెనీ యొక్క  ప్రొడక్ట్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి.సద్వినియోగం చేసుకోవాలని పత్తి కూరగాయలు  పళ్ళతోట లకు కలిగే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు.ఈ సందర్భంగా  క్లోరోఫిల్ ఆర్గానిక్స్ వారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏరియా మేనేజర్ మహిపాల్ మాట్లాడుతూ మొగి పురుగు,అగ్గి తెగులు నివారణకు కావలసిన మందులు అందుబాటులో ఉన్నాయని తెలుపడం జరిగింది.ఆరోగ్యవంతంగా రైతులకు ఆరోగ్యకరమైన  జీవితం ఒక సేంద్రీయ ఎరువుల వినియోగించిన ఆహారం తీసుకోవడం మాత్రమే అన్నారు.అలాగే   భూసారం పెరిగి మొక్కలు ఆరోగ్యవంతంగా ఉండి అధిక దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు.పైరు    ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి దొడ్డే రాజేందర్ జమ్మికుంట,మడిపల్లి మాజీ గ్రామ సర్పంచ్ పరుశరాములు,స్థానిక డీలర్ బైరెడ్డి కిరణ్ రెడ్డి  (కిరణ్ రెడ్డి అగ్రి ట్రేడర్స్) ఇల్లందకుంట,గ్రామం లోని 110 మంది పైగా రైతులు పాల్గొన్నారు.