డ్రోన్ స్పేయర్ కు యువకులకు రుణ సదుపాయం

By dhanadhannews.com

  • రైతులు సకాలంలో రుణాలు చెల్లించి సంఘ అభివృద్ధికి పాటుపడాలి
  • ప్యాక్స్ చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి

సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి లో సోమవారం రోజున విశాల సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో  అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించినట్లయితే రైతులకు ఆర్థిక భారం తగ్గి సంఘ అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని, ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో డ్రోన్ స్పేయర్ అవసరం అవుతుంది గ్రామంలో రైతులు పండించే వరి మొక్కజొన్న పత్తి పంటలకు చీడపీడల నివారణ కోసం పిచికారి చేసేందుకు డ్రోన్ స్పేయర్ ఉపయోగిస్తున్నారని అన్నారు,  డ్రోన్స్  స్ప్రే ఆరు లక్షల వరకు అవుతుందని  ఈ రుణ సదుపాయం డ్రోన్ స్పేయర్ కు సంఘం నుండి రుణ సదుపాయం యువకులకు కల్పించడం జరుగుతుందని తద్వారా యువకులు ఉపాధి కల్పించడంతో పాటు రైతులు అధిక దిగుబడి సాధించడం జరుగుతుందని తెలిపారు,ప్రభుత్వం గత నెలలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిందని,రుణమాఫీ కాని రైతులకు కంప్యూటర్లో సాంకేతిక సమస్యల వల్ల వారికి రుణమాఫీ కాలేదని త్వరలో వారి కూడా రుణ మాఫీ చేస్తుందని గ్రామాల వారిగా రుణమాఫీ అయిన రైతుల వివరాలు తెలిపారు. రైతులకు అత్యధికంగా రుణాలు మంజూరు చేసినది నా బ్యాంకు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మునిపాల రవి, బొమ్మగాని రాజు,నమిండ్ల జమున,గుండేటి జయ కృష్ణ ,పల్లేని ప్రవీణ్ రావు,ఏలూరు తిరుపతి రెడ్డి ,ఏలూరు నర్సిరెడ్డి,ఓలాద్రి మైపాల్ రెడ్డి, సహకార శాఖ సీనియర్ అసిస్టెంట్ ఆడిటర్ శ్రీనివాస్ మరియు సంఘ పరిధిలోగల రైతులు,సంఘ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.