జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో గురువారం రాత్రి శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని రజక యువజన సంఘం జిల్లా నాయకులు కైలాసకోటి గణేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా పత్రిక ప్రకటనలో గణేష్ మాట్లాడుతూ రజక కుల బాంధవుడు శ్రీ మల్లేశ్వర స్వామి విగ్రహాల ధ్వంసం చేసి రజక కుల బాంధవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు.తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నప్పటికీ పట్టించుకునే పాపాన పోవడం లేదని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి హిందువులకు న్యాయం చేయాలని కోరారు.
